భారత్:అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు..
- May 22, 2020
లాక్డౌన్ సంక్షోభంతో ఆర్థికంగా నష్టపోయిన చాలా కంపెనీలు ఉద్యోగులను తీసివేయడమో లేదా వేతనాల్లో కోత వంటివి చేస్తున్నాయి. వాటన్నిటికీ విరుద్ధంగా ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ.. తమ సంస్థలో పని చేసేందుకు 50 వేల మంది సిబ్బంది అవసరం అని ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 50 వేల మందిని నియమించుకోనున్నామని తెలిపింది. అమెజాన్ ఫ్లెక్స్‌లో స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, పార్ట్‌టైమ్ ఉద్యోగాల కింద వీరిని తీసుకుంటామని సంస్థ తెలిపింది. భారతదేశం అంతటా అమెజాన్ కేంద్రాలు, డెలివరీ నెట్‌వర్క్‌లో ఈ అవకాశాలు ఉంటాయని ప్రకటించింది. కరోనా సంక్షోమ సమయంలో సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తామని అమెజాన్ కస్టమర్ ఫుల్‌ఫిల్మెంట్ ఆపరేషన్స్, వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







