అల్ అవిర్ రోడ్ మరియు ఇంటర్నేషనల్ సిటీ ప్రవేశాలు సులభతరం
- January 31, 2016
అల్ అవిర్ రోడ్ మరియు ఇంటర్నేషనల్ సిటీ ప్రవేశ మార్గాల్ని మరింత సులభతరం చేయడానికి రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ అనేక ప్రాజెక్టులను చేపట్టింది. 191 మిలియన్ దిర్హామ్లను వెచ్చించి చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలతో అల్ అవిర్ రోడ్ రూపు రేఖలు మారనున్నాయి. అలాగే ఇంటర్నేషనల్ సిటీకి వెళ్ళే మార్గాలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, ప్రయాణం మరింత సుఖవంతంగా మార్చడమే ముఖ్య ఉద్దేశ్యాలుగా ఈ ప్రాజెక్టులు చేపడ్తున్నట్లు ఆర్టిఏ డైరెక్టర్ మరియు బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్ మత్తర్ అల్ తయార్ చెప్పారు. అవసరమైన చోట్ల రోడ్లను వెడల్పు చేయడం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వేగవంతమైన ప్రయాణం, ప్రమాదాలకు ఆస్కారం కల్పించకుండా ఎంట్రన్స్లు ముఖ్య ఉద్దేశ్యంగా రోడ్ల అభివృద్ధి జరగనుంది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







