కువైట్‌ ఆయిల్‌ సెక్టార్‌లో వలసదారులకు నో ఛాన్స్‌

- June 11, 2020 , by Maagulf
కువైట్‌ ఆయిల్‌ సెక్టార్‌లో వలసదారులకు నో ఛాన్స్‌

కువైట్‌: మినిస్టర్‌ ఆఫ్‌ ఆయిల్‌, యాక్టింగ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ అండ్‌ వాటర్‌ డాక్టర్‌ ఖాలెద్‌ అల్‌ ఫదెల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (కెపిసి) మరియు సంబంధిత విభాగాల్లో వలసదారులకు ఇకపై అవకాశాలు వుండవని తెలుస్తోంది. పార్లమెంట్‌ కమిటీ సెషన్‌ సందర్భంగా మాట్లాడుతూ, కొత్త నియామకాలు కెపిసికి సంబంధించి వలసదారులకు వుండవనీ, స్పెషల్‌ కాంట్రాక్ట్స్‌కి సంబంధించిన నెంబర్స్‌ క్రమక్రమంగా తగ్గుతాయనీ ప్రకటించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో కువైటీ ఆయిల్‌ ధర తగ్గిందని చెప్పారు. అయితే మార్కెట్స్‌ మళ్ళీ రికవర్‌ అవుతున్నట్లు వివరించారాయన. నేషనల్‌ పెట్రోలియం కంపెనీల్లో పనిచేసే కువైటీ సిటిజన్స్‌ లే-ఆఫ్‌ విషయంలో అప్రమత్తంగా వున్నట్లు కూడా చెప్పారాయన.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com