రజనీకాంత్ పాస్పొర్ట్ మరిచిపోయారు..
- February 01, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి' షూటింగ్ దశలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్ మలేషియాలో జరగాల్సి ఉంది. ఇందు కోసం రజనీ సోమవారం ఉదయం 11.45 గంటలకు చెన్నై నుంచి మలేషియా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అనంతరం ఆఖరి నిమిషంలో తాను పాస్‌పోర్ట్ మరిచిపోయినట్టు తెలుసుకున్నారు. దీంతో ఆయనతోపాటు చిత్రయూనిట్‌లోని కొందరు సభ్యులు, నిర్మాత కలైపులి ఎస్.థానులు కొంత సేపు కంగారు పడ్డారు. అయితే రజనీ వెంటనే తన సహాయకులకు ఫోన్ చేసి ఇంటి నుంచి పాస్‌పోర్ట్‌ను తెప్పించుకున్నారు. అదే సమయానికి విమానాన్ని కూడా అందుకోగలిగారు.ఈ విషయం తెలుసుకున్న మీడియా, రజనీ అభిమానులు కొంత సేపు హల్ చేశారు. చివరికి అంతా ప్రశాంతంగా సర్దుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







