సినీనటుడు చిరంజీవి ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు
- February 01, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు చిరంజీవి బహిరంగ లేఖ రాశారు. 'ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఆవేదన కలిగిస్తున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు గర్జన సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలు దిగ్ర్భాంతి కలిగించాయి. అయితే ఈ సంఘటనలకు ప్రధాన కారణం...20 మాసాలుగా రాష్ట్రంలో పారదర్శకత లేకుండా సాగుతున్న మీ పరిపాలనే కారణం అని చెప్పడానికి అనే ఉదంతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాపులను బీసీల్లో చేర్చతామని ఏడాదికి వెయ్యి కోట్ల నిధులు ఇస్తామని.. 18 నెలలు కాలయాపన చేసి కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఇచ్చారు.రైతు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని, కాపులను బీసీల్లో చేర్చే మాటను కూడా విస్మరించారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీల్లో చేర్చేలా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి. ఇక అమరావతి నిర్మాణంలోనూ పారదర్శకత లోపించింది. పాలనా లోపాలు నిరూపించిన వారిపై ఎదురు దాడి చేయడం దారుణం. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే కాపులు, బీసీలు మహిళలే కాదు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చినవారు సైతం రోడ్డెక్కి ఉద్యమం చేస్తారు' అని చిరంజీవి హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







