తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
- June 19, 2020
హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం ఒక్క రోజే 499 కొత్త కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 6,525కి పాజిటివ్ కేసులు చేరాయి. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి 198 మందిని పొట్టన పెట్టుకుంది. అధికారులు లెక్కల ప్రకారం 2976 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 3352 మంది డిశ్చార్జ్ అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. రెండు రోజులుగా GHMC పరిధిలో 300 మార్కును కరోనా కేసులు దాటేస్తున్నాయి. ఇప్పటివరకు GHMC పరిధిలో 4526 కు కరోనా కేసులు చేరాయి. దీంతో గ్రేటర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచడంతో కరోనా కేసులూ భారీగా నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 50,569 కరోనా టెస్టులు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్







