దుబాయ్:మోసాలకు పాల్పడుతున్న 20 గ్యాంగులు..47 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

- July 01, 2020 , by Maagulf
దుబాయ్:మోసాలకు పాల్పడుతున్న 20 గ్యాంగులు..47 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

దుబాయ్:మాయదారి మాటలు, డేటింగ్ లింకులతో ప్రజలను మోసం చేస్తున్న అఫ్రికన్ గ్యాంగ్ ఆటకట్టించారు దుబాయ్ పోలీసులు. ప్రజల్ని మోసం చేస్తున్న 20 గ్యాంగులను గుర్తించి అందులోని 47 మంది సభ్యుల్ని అరెస్ట్ చేశారు. ప్రజల బలహీనతల్ని అవకాశంగా మలుచుకొని కట్టుకథలతో ప్రజలను లూటీ చేస్తున్నాయి ఆఫ్రికన్ గ్యాంగులు. సైబర్ నేరాలు, మోసాలు, దోపిడి, బ్లాక్ మెయిలింగ్ ఇలా అన్ని రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. చివరికి లాక్ డౌన్ సమయంలో అంతర్జాతీయ సరిహద్దులు మూసివేసిన ఘటనను కూడా తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇళ్లలో పని చేసేందుకు కార్మికులను రిక్రూట్ చేస్తామంటూ కొందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత వాళ్లను హ్యాండ్ ఇచ్చారు. ఓ జంట ఇలా డొమస్టిక్ వర్కర్స్ రిక్రూట్మెంట్ పేరుతో మోసాలకు పాల్పడినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. కొన్ని డేటింగ్ లింకులను పంపించి..యువతను వలలోకి దించి సైబర్ నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. ఆపరేషన్ క్రైమ్ ఆఫ్ షాడోతో ఆఫ్రికన్ ముఠాలను పట్టుకున్నారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన లింకుల జోలికి వెళ్లొద్దని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అలాగే మెసేజ్ లకు కూడా స్పందించొద్దని హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com