చైనీస్ సోషల్ మీడియా 'వీబో' నుంచి తప్పుకున్న మోదీ
- July 01, 2020
న్యూ ఢిల్లీ:59 చైనా యాప్ లను రద్దు చేసిన మోదీ సర్కార్ ఈ రోజు వీబో అకౌంట్ ను తొలగించారు. 2015లో చైనాలో పర్యటించిన ప్రధాని విబో ఖాతాను తెరిచారు. అయితే ప్రస్తుత పరిస్తితులు చైనాకు అనుకూలంగా లేనందున వీబో అకౌంట్ లో గతంలో పెట్టిన ప్రొఫైల్ ఫోటోతో పాటు పూర్తి వివరాలను, కామెంట్లను, పోస్టులను అన్నింటినీ తొలగించారు. ఈ రోజు ఆ పేజి బ్లాంక్ గా ఉందని అధికారులు ప్రకటించారు. వీబోలో మోదీకి 2,44,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది చైనీయులే ఉండడం గమనార్హం. చైనా భాషలోనే మోదీ వారితో సంభాషణ నెరపేవారు. 2015 నుండి భారత ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పుట్టిన రోజు జూన్ 15 సందర్భాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు అందజేసేవారు. కానీ ఈ ఏడాది జిన్ పింగ్ కు మోదీ శుభాకాంక్షలు తెలపలేదు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?