బహ్రెయిన్:ఇక మధ్యాహ్నం వేళలో పని నిషేధం..నిబంధనలు అతిక్రమిస్తే 3 నెలల జైలు

- July 01, 2020 , by Maagulf
బహ్రెయిన్:ఇక మధ్యాహ్నం వేళలో పని నిషేధం..నిబంధనలు అతిక్రమిస్తే 3 నెలల జైలు

మనామా:సమ్మర్ ఎండలు తీవ్రం కావటంతో కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు బహ్రెయిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి మధ్యాహ్నం వేళల్లో ఖచ్చితంగా కార్మికులకు విశ్రాంతి కల్పించాల్సిందేనని ఆదేశించింది. ప్రతి యేటా వేసవిలో కార్మికులకు మధ్యాహ్న విరామం ప్రకటిస్తున్న విషయం తెలిసింది. జులై, ఆగస్ట్ నెలలో సాయంత్రం 4 గంటల వరకు కార్మికులకు ఎండ తగిలే ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో విశ్రాంతి ఇవ్వాలని కార్మిక, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ప్రకటించింది. వేడి వాతావరణాన్ని తట్టుకునేలా కార్మికులకు తగిన ఏర్పాటు చేయాలంది. మొత్తం దేశంలోని 30 వేల కంపెనీలు, సంస్థల్లో మధ్యాహ్న పనివేళలపై నిషేధం ఖచ్చితంగా అమలయ్యేలా తాము పర్యవేక్షిస్తామని కార్మిక శాఖ వెల్లడించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్ష, BD500 జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించింది. కార్మిక శాఖ నిబంధనలను ఏవైనా కంపెనీలు, సంస్థలు ఉల్లంఘించిన్టలు గుర్తిస్తే వెంటనే 17873648కి ఫోన్ చేసి తమకు సమాచారం అందించాలని, ఇదే హాట్ లైన్ నెంబర్ కు కార్మికులు కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేవచ్చని కార్మిక శాఖ అధికారులు సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com