మస్కట్:మద్యం ఉత్పత్తులపై 100 శాతానికి పన్ను పెంపు
- July 02, 2020
మస్కట్:మద్యం ఉత్పత్తులపై పన్ను శాతాన్ని రెట్టింపు చేసింది ఒమన్ ప్రభుత్వం. ఇక నుంచి ఎంపిక చేసిన మద్యం ఉత్పత్తులపై 100 శాతం పన్ను వసూలు చేయనున్నారు. నిన్నటి నుంచే కొత్త ట్యాక్స్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే..పన్ను మినహాయింపు పొందిన షాపులకు మాత్రం ఈ కొత్త ట్యాక్స్ విధానం వర్తించదు. మద్యం ఉత్పత్తులతో పాటు ఎనర్జీ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, మాంసం ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులపై వంద శాతానికి పన్నును పెంచింది. నిజానికి గతేడాదిలోనే ఈ ఉత్పత్తులు అన్నింటిపై వంద శాతం పన్ను వసూలు చేశారు. అయితే.. కొన్నాళ్ల త్వర్వాత వ్యాపారులకు ఊరటనిస్తూ పన్నును 50 శాతానికి తగ్గించింది ఒమన్ ప్రభుత్వం. ఇప్పుడా మినహాయింపును మళ్లీ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచే 100 శాతం పన్ను విధానం అమలులోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు