కరోనా ఎఫెక్ట్:దేశం వదిలి వెళ్లిన లక్ష మంది ప్రవాసీయులు..
- July 02, 2020
కువైట్ సిటీ:కరోనా ప్రభావం తర్వాత కువైట్ నుంచి స్వదేశాలకు వెళ్లిన ప్రవాసీయుల గణాంకాలను విడుదల చేసింది పౌరవిమానయాన సంస్థ-DGCA. ఒక్క జూన్ నెలలోనే దాదాపు లక్ష మంది ప్రవాసీయులు కువైట్ ను వదిలి వెళ్లారని వెల్లడించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 590 విమానాలు ప్రవాసీయులను ప్రపంచంలోని తమ తమ గమ్యస్థానాలకు చేరవేశాయని వెల్లడించింది. డీజీసీఏ విడుదల చేసిన గణాంకాల మేరకు కువైట్ వదిలి వెళ్లిన ప్రవాసీయుల్లో ఈజిప్టియన్లు మొదటి వరుసలో ఉన్నారు. 49,986 మంది జూన్ నెలలో కువైట్ వదిలి స్వదేశానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్థానం ప్రవాస భారతీయులదే. 185 విమానాల్లో 30,033 మంది ప్రవాసీయులు ఇండియా చేరుకున్నారు. 32 ఫ్లైట్స్ లో 6492 మంది ఖతార్ వెళ్లారు. అయితే..ఖతార్ వెళ్లిన వారిలో ఎక్కువ మంది యూరోపియన్, అమెరికన్ జాతీయులే ఉన్నారు. వాళ్లంతా ముందుగా ఖతార్ చేరుకొని అక్కడి నుంచి వారి స్వదేశానికి చేరుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







