తొలి స్వదేశీ సోషల్ మీడియా యాప్‌ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

తొలి స్వదేశీ సోషల్ మీడియా యాప్‌ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

న్యూ ఢిల్లీ:సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకున్న వేళ చైనాకు సరైన గుణపాఠం చెప్పాలని భారత్ సంకల్పించింది. ఇందులో భాగంగా చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీయ యాప్‌ల రూపకల్పన ఊపందుకుంది. తొలి దేశీయ సోషల్ మీడియా సూపర్ యాప్‌‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు.ఎలిమెంట్స్ యాప్‌ను విర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు.. విదేశీ యాప్‌లకు దీటుగా నిలవాలని ఆకాంక్షించారు. ఇలాంటి దేశీయ యాప్‌లు మరిన్ని రావాలని ఆయన అన్నారు. గురు పౌర్ణమి రోజున యాప్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఉప రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

Back to Top