బహ్రెయిన్ నుంచి 25 వేల ఇండియన్లను తరలించేందుకు జాబితా సిద్ధం

బహ్రెయిన్ నుంచి 25 వేల ఇండియన్లను తరలించేందుకు జాబితా సిద్ధం

మనామా:వందేభారత్ మిషన్ లో భాగంగా బహ్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. దాదాపు 25 వేల మంది కార్మికులను ఇండియా తీసుకొచ్చేందుకు జాబితా సిద్ధం చేసినట్లు మనమాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. స్వదేశానికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్న 25 వేల మందిని జాబితా అధారంగా దశల వారీగా తరలిస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 8000 మందిని బహ్రెయిన్ నుంచి భారత్ కు తరలించినట్లు వివరించారు. బహ్రెయిన్ లో ఉన్న ప్రవాసీయుల్లో అత్యధిక శాతం భారతీయులే. దాదాపు 4.50 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు భారతీయులు ఉన్నట్లు అంచనా. అయితే..ఇప్పటివరకు బహ్రెయిన్ లో కరోనా బారిన పడి 270 మంది మరణించారు. కరోనా తీవ్రత పెరగటంతో ఆందోళన చెందుతున్న కార్మికులు తిరిగి ఇండియా వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే.

Back to Top