నేడు రాష్ట్రపతి, ప్రధాని విశాఖ చేరుకోనున్నారు..
- February 04, 2016
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకలు శుక్రవారం ఐఎన్ఎస్ శాతవాహన కమాండ్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ నేడు రాత్రి విశాఖ చేరుకోనున్నారు. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి 11 వేల నేవీ ప్రతినిధులు హాజరుకానున్నారు. శనివారం జరిగే తూర్పు నౌకాదళ సమీక్షలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని గౌరవ అతిథిగా హాజరుకానున్నారు.ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్ లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు. వీఐపీల రాక సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సింథియా నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు వాహనాలను నిషేధించారు.ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు, శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఆంక్షలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







