రోడ్డు ప్రమాదం: భారతీయ హౌస్‌మెయిడ్, ఇద్దరు ఖతారీల మృతి
- February 04, 2016
భారతదేశానికి చెందిన హౌస్‌మెయిడ్, ఇద్దరు ఖతారీ జాతీయులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అబుసమారా రోడ్‌లో జనవరి 27న ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతిచెందిన భారతదేశానికి చెందిన హౌస్‌మెయిడ్‌ని బాడుగు రామలక్ష్మిగా గుర్తించారు. ఆమె వయసు 32 సంవత్సరాలు. ఈ ప్రమాదంలో మరో మగ్గురు గాయపడ్డారు. వారిలో ఇద్దరు మహిళలున్నారు. ఖతార్‌లో గడచిన 40 రోజుల్లో నలుగురు భారతీయ హౌస్‌మెయిడ్స్ చనిపోయారు. వారిలో ఓ హౌస్‌మెయిడ్ పనిచేస్తున్న ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఇద్దరు రూమ్‌లో హీటర్ నుంచి వచ్చిన పొగతో ఊపిరి ఆడక చనిపోయారు. 40 రోజుల్లో చనిపోయిన నలుగురూ ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారే. రామలక్ష్మి విశాఖపట్నం జిల్లాకు చెందినవారు. మృతదేహాల్ని భారతదేశానికి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోతుల పుష్పవతి, కుంచె మంగ ఊపిరి ఆడక చనిపోయినవారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







