పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే కార్లకు పార్కింగ్ ఫీజు లేదు.
- February 05, 2016
అజమాన్ లో పర్యావరణ స్నేహపూర్వక కార్లకు ఎటువంటి పార్కింగ్ ఫీజు లేదని ' ఆల్ బాయన్ ' అరబిక్ దినపత్రిక తెలిపింది. పర్యావరణ విద్య, పచ్చదనాన్ని బలపరిచే భావనతో సహా అన్ని సాంకేతిక తో కూడిన ఆవిష్కరణలకు తమ మద్దతు ఉంటుందని అజమాన్ మునసిపాలిటి మరియు ప్రణాళికశాఖాధిపతి షేక్ రాషేడ్ బిన్ హమద్ అల్ నుఐమి పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా స్థిరమైన అభివృద్ధికి యు.ఎ.ఇ. సమీకృత వ్యూహం పెంపొందించుకొనేందుకు ఉన్నత నాయకత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిమ్చనున్నట్లు ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే స్నేహపూర్వక కార్లను ప్రోత్సాహించేందుకు పార్కింగ్ ఫీజును మినహాయసిస్తున్నట్లు తెలిపారు. అలాగే పర్యావరణానికి హాని చేయని నూతన ఆవిష్కరణలకు తమ మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని అల్ నుఐమి వివరించారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







