తెలుగు లలితకళా సమితి, యు .ఎ .ఇ వారి ఆహ్వానము
- February 05, 2016
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
ఆహ్వానము
శ్లో!! జానక్యాః కమలాంమలాంజలి పుటేయాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయితాః !
స్రస్తాః శ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః
ముక్తాస్తా శ్శుభదా భవంతు భవతాం శ్రీ రామ వైవాహికాః !!
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి తిది ,బృగువాసరం ( శుక్రవారము) అనగా తేదీ 15 ఏప్రియల్ 2016 నాడు శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అభిజిత్ లగ్నం నందు విశ్వశాంతి మరియు లోక కల్యాణం కొరకు శ్రీ సీతారామ కళ్యాణం తదనంతరం పట్టాభిషేక మహోత్సవము జరుపుకోనుటకు దైవజ్ఞులు సుముహుర్తము నిర్ణయించినారు గాన తామెల్లరు సకుటుంబ సపరివారి సమేతము గా విచ్చేసి మదర్పిత తీర్ధ ప్రసాదములు స్వీకరించి ఆ పుణ్య దంపతుల దర్శించి భగవత్ కృపకు పాత్రులు కాగలరని మనవి.
కళ్యాణ వేదిక (మిధిలానగరము) : Dubai
ఇట్లు
భవదీయులు
భగవత్ సేవక బృందం
(తెలుగు లలితకళా సమితి, యు .ఎ .ఇ)
మంగళం మహాత్
శ్రీ శ్రీ శ్రీ
జగద్గురువుల ఆశీస్సులతో మరియు గల్ఫ్ లో ని యావత్తు భారతీయుల శుభాభినందనలతో
సర్వేజనాః స్సుఖినో భవంతు
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







