'ఈ-కామర్స్ రంగం 2016లో 2. 5 లక్షల ఉద్యోగాలు
- February 05, 2016
దేశంలో 'ఈ-కామర్స్' రంగం వేగంగా విస్తరిస్తోంది. ఈ రంగం 2016లో ఆన్‌లైన్ రీటైల్ విభాగంలో 60-65 వృద్ధిరేటుతో 2.5 లక్షల కొత్త ఉద్యోగాలని సృష్టిస్తుందని అసోచామ్ నివేదిక పేర్కొంది. గత ఏడాది ఈ-కామర్స్ సంస్థలు గరిష్ఠంగా అమ్మకాలు జరిపాయి. సంస్థలు గణనీయంగా అభివృద్ధి చెందేందుకు ఇది మంచి అవకాశమని నివేదిక తెలిపింది. 2009లో భారత ఈ-కామర్స్ రంగం విలువ 3.8 బిలియన్ డాలర్లు ఉండగా 2014లో 17 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది 23 బిలియన్ డాలర్లకు చేరుకోగా ఈ సంవత్సరం 38 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అసోచామ్ నివేదిక అంచనా. 'ఈ-కామర్స్ రంగం 2016లో 2. 5 లక్షల ఉద్యోగాలు సృష్టించనుంది. ఆన్‌లైన్ రిటైల్ విభాగంతో పాటు తాత్కాలిక ఉద్యోగాలు, సప్లైచైన్, లాజిస్టిక్స్, సంబంధిత విభాగాల్లో ఉద్యోగాల సృష్టి జరుగుతుంది' అని నివేదిక పేర్కొంది. ఈ-కామర్స్ మార్కెట్‌లో 20-25 శాతం మొబైల్ కామర్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ-కామర్స్ సంస్థల్లో నియామకాల వృద్ధి 60-65 శాతం వేగంగా ఉంటుందని వచ్చే మూడు, నాలుగేళ్లలో 5-8 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అసోచామ్ సెక్రెటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. ఐఐఎం లాంటి అత్యున్నత విద్యా సంస్థల్లో ఎంబీఏలు చేసినవారు సంప్రదాయ ఉద్యోగాలకు భిన్నంగా ఈ-కామర్స్ రంగంలో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







