మహిళా టీ20 వరల్డ్ కప్‌లో మిథాలీ రాజ్‌కే కెప్టెన్సీ
- February 05, 2016
భారత్‌లో మార్చి-ఏప్రిల్ నెలలో జరగనున్న మహిళా టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సందీప్ పాటిల్ నేతృత్వంలో సమావేశమైన బోర్డు శుక్రవారం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు.భారత పురుషుల క్రికెట్ జట్టు ఎంపికతో పాటు, మహిళల జట్టును కూడా సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ రెండు టోర్నీలకు మిథాలీ రాజ్‌కే కెప్టెన్సీ పగ్గాలు అప్పజెబుతూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో శ్రీలంకతో ఆడనున్న భారత మహిళల జట్టునే ఆసియా, టీ20 వరల్డ్ కప్ టోర్నీలలో బరిలోకి దిగనుంది.ఈ నెల 24వ తేదీ నుంచి బంగ్లాదేశ్‌లో ఆసియా కప్ ఆరంభం అవుతుండగా, మార్చి 15 నుంచి మహిళల వరల్డ్ టీ20 టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన భారత మహిళల జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది.భారత మహిళల జట్టు:మిథాలీ రాజ్(కెప్టెన్), జూలన్ గోస్వామి, స్మృతీ మందనా, వేదా కృష్ణమూర్తి, హర్మన్ ప్రీత్ కౌర్, శిఖా పాండే, రాజేశ్వరి గ్వైక్వాడ్, సుష్మా వర్మ, పూనమ్ యాదవ్, వీఆర్ వినీత, అనుజా పాటిల్, ఏక్తా బిస్త్, దీప్తి శర్మ, నిరంజనా నాగరాజన్, తిరుష్ కామినిమరోవైపు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. పూణే, రాంచీ, విశాఖపట్టణంలలో ఈ మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. శ్రీలంక సిరిస్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత పురుషుల జట్టు ఇదే.మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, అజింక్యా రహానే, మనీష్ పాండే, రవీంద్ర జడేజా, రవి చంద్రన్ అశ్విన్, హార్డిక్ పాండ్య, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, హర్భజన్, పవన్ నేగీలను ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







