పాలక్‌ ప్రాన్స్‌

- February 06, 2016 , by Maagulf
పాలక్‌ ప్రాన్స్‌

 

కావలసిన పదార్థాలు: (పొట్టు వలచి, శుభ్రం చేసిన) రొయ్యలు - 200 గ్రా., పాలకూర తరుగు - 2 కప్పులు, ఉల్లిపాయ - 1, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర స్పూను, కారం - 1 టీ స్పూను, దనియాలపొడి - 1 టీ స్పూను, గరం మసాల పొడి - పావు టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, పచ్చిమిర్చి - 2, నూనె - 4 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: ఒక టీ స్పూను నూనెలో రొయ్యల్ని పచ్చివాసన పోయేవరకు చిన్నమంటపై వేగించి పక్కనుంచాలి. మరో కడాయిలో మిగతా నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు రెండు నిమిషాలు వేగించాలి. ఇప్పుడు రొయ్యలు, కారం, దనియాలపొడి కలిపి మరికొద్దిసేపు వేగించాలి. తర్వాత పాలకూర తరుగు, ఉప్పు కలిపి మూతపెట్టాలి. పాలకూర మెత్తబడ్డాక కప్పు నీటిని చేర్చి మరికొద్దిసేపు ఉడికించాలి. రొయ్యలు ఉడికి, కూర చిక్కబడ్డాక గరం మసాల పొడి వేసి దించేయాలి. వేడి వేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉండే కూర ఇది. (ఇష్టమైతే పాలకూర తరుగు బదులు దాన్ని ఉడికించి, పేస్టుచేసి కూడా కలుపుకోవచ్చు).

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com