నేడు ప్రధానిని కలవనున్న బాబు ...
- February 08, 2016
కేంద్ర ప్రభుత్వం 2016-17 బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ బయలుదేరారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. అంతకుముందు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతోపాటు, వివిధ కేంద్రమంత్రులను విడివిడిగా కలుస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన ప్రధానితో సమావేశం కానున్నారు. ఉదయం 10.30 గంటలకు పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌శర్మ, 12 గంటలకు రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు, 2.30 గంటలకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్, 3.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, సాయంత్రం 6.30 గంటలకు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్గడ్కరీలతో భేటీ అవుతారు. విభజన అనంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని గట్టునవేసేలా సాయం చేయాలని కోరబోతున్నారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







