ఎన్ టీఆర్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలగా నామకరణం..
- February 09, 2016
విజయవాడ నగరంలోని లబ్బీపేటలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మరో నెల రోజులలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రూ.3.08 కోట్ల వ్యయంతో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. సుమారు మరో రూ.ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ ఆధునిక పశువ్యాధుల నిర్ధారణ పరిశోధనాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. తాజాగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఎంపీ హరికృష్ణ నిధులను ఎంపీ ల్యాడ్స్ నుంచి వినియోగించారు. తొలుత ఆయన పేరే పెడదామన్న ఆలోచన వచ్చింది. అయితే ఇప్పుడు నందమూరి తారకరామరావు సూపర్ స్పెషాలిటీ వైద్యశాలగా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో పోలీసు కమిషనర్‌గా ఉన్న సురేంద్రబాబు పశువుల ఆస్పత్రిని నిర్మించిన స్ధలాన్ని పోలీసు పేరెడ్ గ్రౌండ్‌కోసం కావాలని దరఖాస్తు చేసి జీవో తెప్పించారు.అయితే దీనిపై రైతులు, పశు సంవర్ధకులు ఆందోళన చేయడంతో అప్పటి సీఎం ఎనటీఆర్ పోలీసుల కోసం ఇచ్చిన జీవోను రద్దు చేసి పశు సంవర్ధక శాఖకే అప్పగించారు. దీంతో ఆయన స్మృతి చిహ్నంగా ఆయన పేరు పెట్టారు. మరో నెల రోజులలో సూపర్ స్పెషాలిటీ పశువుల ఆస్పత్రిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ జేడి దామోదరనాయుడు ఆంధ్రజ్యోతితో చెప్పారు. ఇప్పుడు భవనంలోకి పశు సంవర్ధక శాఖ సంచాలకుడి కార్యాలయంతోపాటు ఆస్పత్రి కూడా ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







