డ్రగ్స్ కేసు : నటి సంజన అరెస్టు!
- September 08, 2020
బెంగళూరు:కొద్దిరోజులుగా శాండల్‌వుడ్‌ను డ్రగ్స్ మాఫియా వెంటాడుతోంది. డ్రగ్స్ కేసులో మరో అరెస్టు జరిగింది. ప్రముఖ కన్నడ నటి సంజన గల్రానీ నివాసంపై మంగళవారం ఉదయం బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) పోలీసు విభాగం దాడి చేసి అదుపులోకి తీసుకుంది. కోర్టు నుండి సెర్చ్ వారెంట్ పొందిన తరువాత, డ్రగ్స్ కేసుకు సంబంధించి సిసిబి ఆమె ఇంటిపై దాడి చేసింది. అనంతరం ఆమెను సిసిబి విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. రాగిణి ద్వివేది తరువాత అరెస్టైన వారిలో సంజన రెండవ నటి. నటి సంజన.. రాహుల్ (ఈ కేసులో మరో నిందితుడు) తో చాలా సన్నిహిత సంబంధాలను కొనసాగించింది. అతను సంజన గురించి సిసిబికి కొంత సమాచారం ఇవ్వడంతోనే ఆమెను విచారించారు. పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన సంజన.. 'బుజ్జిగాడు' సినిమాతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







