మరిన్ని మహమ్మారులకు సిద్ధంగా ఉండండి:WHO
- September 08, 2020
జెనీవా:కోవిడ్-19 తోనే ప్రపంచం కకావికలం అవుతుంటే… ఇదేం చిట్టచివరి మహమ్మారి కాదనీ.. మున్ముందు ఇంతకంటే భయంకరమైన వైరస్ రావచ్చుననీ ప్రపంచ ఆరోగ్య సంస్థ భయపెట్టే మాటలు చెబుతోంది.. ఇదేం చివరి వైరస్ కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ ఘాటైన హెచ్చరిక చేశారు. ప్రపంచం మరో వైరస్‌కు రెడీగా ఉంటే మంచిదన్న సలహా కూడా ఇచ్చారు.. ప్రపంచదేశాలు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి.. మరిన్ని నిధులు కేటాయిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారాయన! కరోనాను కంట్రోల్ చేసి సంతృప్తి చెందితే సరిపోదని, ఇంతకంటే ప్రాణాంతక మహమ్మారులు వచ్చే అవకాశం ఉందని ఘెబ్రేయేసన్ అన్నారు. కరోనాకు ముందు కూడా చాలా వైరస్‌లు భూమిని అతలాకుతలం చేశాయని, కరోనా తర్వాత కూడా ఆ పరిస్థితి ఉంటుందని చెప్పుకొచ్చారు.. ఈ వాస్తవాన్ని ప్రజలంతా తెలుసుకుని అందుకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు.. రాబోయే కాలంలో ఇంతకంటే భయంకరమైన వైరస్ వస్తే దాన్ని కూడా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటీ ఈ అనుభవం సరికొత్త పాఠాలు నేర్పిందని, ఇకనుంచైనా వైరస్ నిరోధం కోసం నిధులు సమకూర్చుకోవడం మంచిదని ప్రపంచ దేశాలకు హితవు చెప్పారు టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







