సౌదీ : రియాద్ లోని గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం
- September 09, 2020
సౌదీ అరేబియా రాజధాని రియాద్ పరిధిలో ఓ గోడౌన్ లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గోడౌన్ పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే..అదృష్టవశాత్తు ప్రాణహాని జరగలేదని పౌర రక్షణ సేవ అధికారులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకొగానే అల్ మనఖ్ జిల్లాలోని ఘటనా ప్రాంతానికి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. దీంతో మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించకుండా నిలువరించగలిగారు. అయితే..ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







