కోవిడ్ ఎఫెక్ట్ : డిస్టెన్స్ లెర్నింగ్ ను మరో 2 వారాలు పొడిగించిన షార్జా
- September 09, 2020
కరోనా నేపథ్యంలో వర్చువల్ లెర్నింగ్ వైపే షార్జా విద్యా అధికారులు మొగ్గు చూపుతున్నారు. స్కూల్స్ నిర్వహణపై సమీక్షించిన షార్జా విపత్తుల నిర్వహణ బృందం, షార్జా ప్రైవేట్ స్కూల్స్ అథారిటీ..డిస్టెన్స్ లెర్నింగ్ ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఈ నెల 13 నుంచి 24 వరకు అన్ని ప్రైవేట్ స్కూల్స్ లో అన్ని తరగతుల విద్యార్ధులకు దూర విద్య ద్వారానే పాఠాలు బోధిస్తారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం సూచించిన మార్గనిర్దేశకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తుల నిర్వహణ బృందం, ప్రైవేట్ స్కూల్స్ అథారిటీ ప్రతినిధులు వెల్లడించారు. అయితే..ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తరగతుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!