తెలంగాణ ప్రజల ప్రేమ మరియు ఆప్యాయతలకు వందనం:గవర్నర్

- September 09, 2020 , by Maagulf
తెలంగాణ ప్రజల ప్రేమ మరియు ఆప్యాయతలకు వందనం:గవర్నర్

హైదరాబాద్:తెలంగాణ ప్రజలకు సేవచేడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజలు ట్రెడిషనల్‌గా, ఎమోషనల్‌గా ఎటాచ్ అయ్యారన్నారు. తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి, మీడియాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్ర్యం తరువాత ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల పోరాటం మరవలేనిదన్నారు. అందుకే తెలంగాణ ప్రజలకు ఆమె సల్యూట్ చేశారు. మరికొన్ని రోజుల్లోనే పూర్తి తెలుగు నేర్చుకుంటానని గవర్నర్ చెప్పారు. రాజ్యాంగ విధులు నాకు తెలుసు... ఏడాదిగా చేసిన పనులను ఈ బుక్ ద్వారా విడుదల చేస్తానని అన్నారు.

తన మాటలను సెన్సెబుల్‌గా తీసుకోవాలిగానీ.. సెన్సేషనల్‌గా తీసుకోకూడదని గవర్నర్ తమిళిసై అన్నారు. డాక్టర్‌గా పరిస్థితిని ప్రజలకు వివరించానని... కానీ ఫిజీషియన్‌గా మాట్లాడినా రాజకీయంగా తీసుకుంటున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశాఉ. ఓపెన్‌గా మాట్లాడుతా... రాజకీయం చేసినా ప్రజల కోసమే మాట్లాడాను అని చెప్పారు. అంతేకాదు తాను చెప్పాలనుకున్న విషయాలను చెప్పానని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వానికి పాజిటివ్‌గా సూచనలు చేశానని తెలిపారు.

కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసినట్లు గవర్నర్ తెలిపారు. జిల్లా ఆసుపత్రులలో కరోనా చికిత్సకు.. ప్రైవేట్ ల్యాబ్‌లలో టెస్టులకు అనుమతి ఇవ్వాలని చెప్పానని, ప్రభుత్వం అలాగే ఇచ్చిందన్నారు. ఇక కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేయాలని సూచించానన్నారు. ఇన్సూరెన్స్ ఉన్నవారికి చికిత్స నిరాకరించ వద్దని చెప్పినట్లు గవర్నర్ తెలిపారు. జర్నలిస్ట్ హెల్త్ కార్డులను తప్పకుండా యాక్సెప్ట్ చేయాలన్నారు. ఇక కరోనా విషయంలో ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగైందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా ఆమె గిరిజనుల సమస్యలతోపాటు యూనివర్సిటీల్లో లోపాలు... తదితర అంశాలపై మాట్లాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com