మెగాస్టార్ ఇంట పెళ్లిసందడి
- February 11, 2016మెగాస్టార్ ఇంట పెళ్లిసందడి మొదలైంది. పైన కనిపిస్తున్న ఫోటో ఆ సందర్భంలోనిది. చిరంజీవి కూతురు శ్రీజని చిత్తూరుకు చెందిన ఓ ఎన్ఆర్ఐతో నిశ్చితార్థం జరిగింది. మెగా బ్రదర్స్ దగ్గరుండి మ్యారేజ్ డేట్ తదితర పనులను పూర్తి చేశారు. ఈ క్రమంలో మెగా ఇంట్లో పసుపు పనులు మొదలయ్యాయి. తొలిరోజు బంధుమిత్రులతో శ్రీజ ఫోటో బయటకురాగా, ఇప్పుడు చిరంజీవి వంతైంది.ఇళ్లంతా బంధుమిత్రులతో సందడిగా మారింది. మ్యారేజ్ ఈనెల కాకపోతే వచ్చేనెలలో వుండవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. కొద్దిరోజులుగా శ్రీజ వివాహంపై వార్తలొస్తున్నా మెగా క్యాంపు వాటిని ఖండించలేదు. తాజా ఫోటోతో శ్రీజ మ్యారేజ్ ఖాయమని చెప్పుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.
తాజా వార్తలు
- అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
- టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
- ఫుట్‌బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్‌కు 4 రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్..!!
- చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!
- మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!
- రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
- 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో దీపావళి..