డ్రైవింగ్ లైసెన్స్‌లేని వారు వాహనాన్ని నడిపితే జైలుకు...
- February 12, 2016
లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే జైలుకు వెళ్లక తప్పదు. వాహనం నడుపుతున్న వారితోపాటు వెనుక కూర్చున్న వారికి హెల్మెట్ తప్పనిసరి కానున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈనెల చివరివారం నుంచి కఠిన నిబంధనలు అమలులోకి రానున్నాయని ఆర్టీఏ కమిషనర్ సందీప్ సుకుమార్ సులానియ, నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్ వెల్లడించారు. శుక్రవారం వారు మీడియాతో సంయుక్తంగా మాట్లాడారు. సుప్రీంకోర్టు కమిటీ సూచనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్‌లేని వారు వాహనాన్ని నడిపినా, వారికి వాహనం ఇచ్చిన యజమానిపై చర్యలు తప్పవని వారు వెల్లడించారు.అతివేగం, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడ్, డ్రంకెన్ అండ్ డ్రైవ్, మొబైల్‌ఫోన్ డ్రైవింగ్ చేసే వారి లైసెన్స్‌లు తాత్కాలికంగా రద్దు చేస్తామన్నారు. మూడుసార్లకంటే ఎక్కువగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈ చర్యలు తప్పవని చెప్పారు. లైసెన్స్ సస్పెన్షన్‌లో ఉన్నప్పుడు వాహనం నడిపేవారిపైనా, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిపైనా మోటార్ వాహనాల చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి చార్జిషీట్లు నమోదు చేస్తామన్నారు. ఈ చట్టాల ప్రకారం మూడు నెలల వరకు జైలుశిక్ష తప్పదని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరని, వాహనం నడుపుతున్న వారితోపాటు వెనుక కూర్చున్నవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపేవారికి జరిమానాలు విధిస్తామన్నారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆన్‌లైన్ కాలుష్య తనిఖీ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కొనసాగుతున్న 2 గ్యాస్ అనలైజర్స్‌ను రద్దుచేసి 4 గ్యాస్ అనలైజర్స్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. వాహనాల క్రయవిక్రయాల సందర్భంగా పేరుమార్పిడి చేసుకోనివారు వెంటనే చేసుకోవాలని సూచించారు. ఇలాంటివారు రికార్డులలో పేరు మారేవరకు ప్రత్యామ్నాయంగా చిరునామాను ఆన్‌లైన్‌లో ఫీడ్ చేసుకోవచ్చని సూచించారు. transport.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ సర్వీసెస్ క్లిక్ చేసి, ప్రత్యామ్నాయ చిరునామాను నమోదు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







