కమలాపండ్లతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు
- February 13, 2016
ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువగా దొరుకుతున్న పండ్లు కమలాలు. వర్షాకాలం, చలికాలంలో వీటిని తినాలంటే చాలా మంది జలుబు చేస్తుందని ఫీలవుతూ ఉంటారు. కానీ వీటిని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. వీటిలో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెరగడానికి సహకరిస్తాయి. ఈ కాలంలో చీప్ గా, విరివిగా దొరికే కమలాపండ్లతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని డైరెక్ట్ గా తీసుకున్నా.. రసం తీసి తీసుకున్నా మంచిదే అంటున్నారు నిపుణులు. కాబట్టి రెగ్యులర్ గా కమలాపండ్లను తీసుకుంటే పొందే లాభాలేంటో చూద్దాం. కమలాపండ్లు తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు చేరడాన్ని నిరోధిస్తాయి. ఆరంజ్ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీ జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. కాలేయ క్యాన్సర్‌ను అరికట్టే శక్తి కమలాపండ్లకు ఉంది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కాలేయంలో వచ్చే ఇన్ఫెక్షన్ ల నుంచి దూరంగా ఉండవచ్చు. శరీరంలో కొవ్వు పేరుకోవడాన్ని కమలాపండు అరికడుతుంది. కొలెస్ర్టాల్ పెరుగుదలను నిరోధించడంలో కమలాలు చాలా శక్తిమంతంగా పనిచేస్తాయి. కమలాపండ్లలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దాంతోపాటు ఆకలిని పెంచుతుంది. జీర్ణసంబంధ సమస్యలతో బాధపడే వాళ్లకు కమలాపండ్లు చక్కటి పరిష్కారం. హృదయస్పందనలకు అవసరమైన పొటాషియం, మెగ్నీషియం కమలాపండ్లలో పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు రక్తపోటును అదుపులోవుంచి, పల్స్ రేటులో హెచ్చుతగ్గులు రాకుండా చూస్తాయి. కమలాపండ్లలో ఎక్కువగా ఉండే విటమిన్ సి చర్మానికి ఉపయోగపడతాయి. చర్మకణాలు పాడవకుండా, చర్మం నిగారింపుతో ఉండటానికి సి విటమిన్ సహాయపడుతుంది. టీబీ, టైఫాయిడ్ లాంటి వాటితో బాధపడే వారికి కమలారసం మంచి శక్తినిచ్చి వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేందుకు సహకరిస్తుంది. కమలాపండ్ల రసాన్ని తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు జలుబు, తుమ్ముల నుంచి దూరంగా ఉంచడానికి ఇవి సహాయపడతాయి. చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్లు కమలారసంలో లేత కొబ్బరి నీటిని కలిపి తాగితే యూరిన్ లో వచ్చే మంట వంటి సమస్యలు తగ్గిపోయి మంచి ఉపశమనం కలిగిస్తాయి. బీపీని కంట్రోల్ చేయడంలో ఆరంజెస్ బాగా ఉపయోగపడతాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. కంటిచూపు సమస్యలతో బాధపడేవాళ్లకు ఆరంజ్ చక్కటి పరిష్కారం. వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు సమస్యలు తగ్గిపోతాయి. వర్షాకాలం, శీతాకాలాలలో వైరల్ ఇన్ఫెక్షన్లు చాలా ఎక్కువగా వస్తుంటాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్ రాకుండా కమలాలు కాపాడతాయి. శరీరంలోని మలినాలను శుద్ధిచేసి ఉల్లాసంగా ఉంచడానికి కమలాపండ్లు ఉపయోగపడతాయి. రోజూ కమలాపండ్లను తినడం వల్ల మనం చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









