కోన వెంకట్ కొత్త కాంబినేషన్‌తో...
- February 16, 2016
రచయిత కోన వెంకట్ సారథ్యంలో ఇప్పుడు ఓ కొత్త ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమైంది. ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ కలసి ఒక తమిళ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నీ నిజమే నని తెలిసేలా కోన వెంకట్ తాజాగా ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని (తెలుగు వెర్షన్‌ను) ఎం.వి.వి. సినిమా పతాకంపై అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో 'నాన్న' లాంటి చిత్రాల ద్వారా సుపరిచితుడూ, హీరోయిన్ అమలా పాల్ భర్త అయిన ఎల్. విజయ్ ఈ చిత్రానికి దర్శకుడు. ''దర్శకుడు విజయ్ చాలా ప్రతిభావంతుడు.ఆయనే ఈ చిత్రానికి కథ కూడా రాశారు. ఈ కథపై నాకు చాలా నమ్మకం ఉంది. శివ తుర్లపాటి ప్రారంభించిన 'బ్లూ సర్కిల్ కార్పొరేషన్'తో కలసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాం.ఈ సినిమాను సమర్పిస్తూ, తెలుగు డైలాగ్స్ రాస్తున్నందుకు గర్విస్తున్నా'' అని కోన వెంకట్ వ్యాఖ్యానించారు. హార్రర్ నేపథ్యంలో కథ నడుస్తుందని భోగట్టా. సప్తగిరి కూడా ఇందులో ఒక పాత్రధారి. వీటన్నిటికీ తగ్గట్లే కోన కూడా, ''మీకు గనక 'గీతాంజలి' సినిమా నచ్చితే, అంతకు పదింతలు ఈ సినిమా మీకు నచ్చుతుంది'' అని పేర్కొన్నారు.కథాంశం మాటెలా ఉన్నా, చాలా రోజుల తరువాత ప్రభుదేవా మళ్ళీ నటించడం, తమన్నా, సోనూసూద్ తదితరులు సహనటులు కావడం లాంటివి ఆసక్తికరమే. టైటిల్‌తో సహా ఇతర విశేషాలు తెలుసుకోవడానికి లెటజ్ వెయిట్!
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







