'కాదల్' మూవీ టీజర్ విడుదల
- November 14, 2020
హైదరాబాద్:విశ్వంత్, చిత్ర శుక్ల జంటగా నటించిన సినిమా ''కాదల్''. ఈ చిత్రంతో
కళ్యాణ్ జీ గొంగన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. టఫ్ఎండ్ స్టూడియోస్
లిమిటెడ్ స్టూడియోస్ లిమిటెడ్ పతాకంపై కిరణ్ రెడ్డి మందాడి
నిర్మిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా కాదల్ సినిమా టీజర్ ను విడుదల
చేశారు.
టీజర్ చూస్తే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తెలుస్తోంది. 2004లో జరిగిన ప్రేమ
కథ అంటూ టీజర్ లో చూపించారు. అందమైన అమ్మాయిని చూడగానే ఆమెతో మాట్లాడాలని
ప్రయత్నించే రొమాంటిక్ కుర్రాడి పాత్రలో హీరో యశ్వంత్ కనిపించాడు. నా
వయసు నీకంటే ఎక్కువని బాధపడుతున్నావా అని హీరోయిన్ చిత్ర శుక్ల అడిగితే,
అబ్బే ఏజ్ గురించి ఏముంది ఊరికే మాట్లాడటానికి అంటూ మనసులోని ప్రేమను
దాచే ప్రయత్నం చేస్తున్నట్లు టీజర్ లో ఉంది. ఆ అమ్మాయి నీకు కూడా అక్కేరా
అంటూ తండ్రి కొడుకును కంట్రోల్ లో పెట్టేందుకు చెప్పే డైలాగ్ లు సరదాగా
ఉన్నాయి. టీజర్ లో వచ్చిన థీమ్ మ్యూజిక్ ఎంతో ప్లెజంట్ గా ఉండి
ఆకట్టుకుంటోంది.
ఆశిష్ గాంధీ, రాకేందు మౌళి, దేవి ప్రసాద్, అన్నపూర్ణమ్మ, రాకెట్ రాఘవ,
అప్పాజీ అంబరీష్, రూపా లక్ష్మి, డీజే దినేష్ తదితరులు ఇతర పాత్రల్లో
నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్
ప్రొడ్యూసర్ : రామ్ మద్దుకూరి
ఆర్ట్ - ఆరె వెంకటేశ్వర్లు, సాహిత్యం - రాకేందు మౌళి, పీఆర్వో - జీఎస్కే మీడియా
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







