‘అభయం’ యాప్ను ప్రారంభించిన సిఎం జగన్
- November 23, 2020
అమరావతి: ఏపి సిఎం జగన్ రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ‘అభయం’ యాప్ను ప్రారంభించారు. రవాణాశాఖ పర్యవేక్షణలో అమలయ్యే ఈ ప్రాజెక్టును సోమవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం అభయం ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నామన్నారు. మహిళల కోసం ఇప్పటికే అమ్మ ఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. నామినేటెడ్ పదవులు,పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించామని పేర్కొన్నారు. హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించిట్లు స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించేలా అడుగులు వేస్తున్నామన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటంలేదని అన్నారు.



తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









