ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- June 13, 2026
ఉమ్ అల్ ఖువైన్: ఉమ్ అల్ ఖువైన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (UAQ Chamber) మరియు థంబే యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎమిరేట్‌లోని వ్యాపార వర్గాలు, వారి కుటుంబాలు మరియు స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడంతో పాటు ఆరోగ్య రంగం–ఆర్థిక రంగాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ఒప్పందంపై ఉమ్ అల్ ఖువైన్ చాంబర్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ ఒబైద్ ఇబ్రహీం అల్ అలీ మరియు థంబే హెల్త్‌కేర్ వైస్ ప్రెసిడెంట్ అక్బర్ మొయిదీన్ తుంబె సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం చాంబర్ సభ్యులకు ప్రత్యేక వైద్య సేవలు, ఆరోగ్య ప్రయోజనాలు అందించడంతో పాటు రెండు సంస్థలు పరస్పర నైపుణ్యాలను పంచుకోవడం, సంయుక్త కార్యక్రమాలు నిర్వహించడం, ఆరోగ్య మరియు ఆర్థిక రంగాల్లో అవగాహన పెంపొందించడం వంటి అంశాలపై కలిసి పనిచేయనున్నాయి.
ఈ సందర్భంగా అహ్మద్ ఒబైద్ ఇబ్రహీం అల్ అలీ మాట్లాడుతూ, “మా సభ్యుల సంక్షేమం మాకు అత్యంత ముఖ్యమైనది. తుంబె యూనివర్సిటీ హాస్పిటల్‌తో ఈ భాగస్వామ్యం ద్వారా సభ్యులు మరియు వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ అవుతాయి. వాణిజ్యాభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కూడా చాంబర్ బాధ్యతగా భావిస్తున్నాం” అని తెలిపారు.
థంబే హెల్త్‌కేర్ వైస్ ప్రెసిడెంట్ అక్బర్ మొయిదీన్ తుంబె మాట్లాడుతూ, “ఆరోగ్యవంతమైన సమాజం మరియు బలమైన ఆర్థిక వ్యవస్థ ఒకదానికొకటి పరస్పర అనుసంధానమై ఉంటాయి. ఉమ్ అల్ ఖువైన్ అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యాపార వర్గాలకు మా వైద్య నైపుణ్యాన్ని అందించే అవకాశం లభించడం ఆనందంగా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా సమాజానికి మరింత మెరుగైన సేవలు అందించగలమని విశ్వసిస్తున్నాం” అన్నారు.
ఈ ఒప్పందం ద్వారా సభ్యుల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకాలు రూపొందించడం, ఆరోగ్య మరియు వ్యాపార రంగాల మధ్య జ్ఞాన మార్పిడి కార్యక్రమాలు చేపట్టడం, అలాగే ఉమ్ అల్ ఖువైన్‌లో స్థిరమైన అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
యూఏఈలో ప్రజా మరియు ప్రైవేట్ సంస్థలు తమ తమ రంగాలకు పరిమితం కాకుండా పరస్పర సహకారంతో ప్రజల జీవన నాణ్యతను పెంచేందుకు, మరింత బలమైన మరియు స్థిరమైన సమాజాల నిర్మాణానికి కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







