డిసెంబర్ 4న శ్రేయాస్ ఎటిటి ద్వారా విడుదల కానున్న 'రాంగ్ గోపాల్ వర్మ'
- November 24, 2020
హైదరాబాద్:సీనియర్ జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన "రాంగ్ గోపాల్ వర్మ" డిసెంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ర్యాప్ రాక్ షకీల్ స్వరకల్పనలో రూపొందిన ఈ చిత్రం టైటిల్ సాంగ్ వైరల్ కావడం తెలిసిందే!
షకలక శంకర్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో కత్తి మహేష్, జబర్దస్త్ అభి ముఖ్య పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 4 న విడుదల కానుంది!
ఒకప్పుడు దర్శకుడిగా ఒక వెలుగు వెలిగి.. గత కొన్నేళ్లుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, అర్ధ నగ్న, పూర్తి నగ్న చిత్రాలు తీస్తూ.. "సామాజిక కాలుష్యానికి" కారకుడు అవుతున్న ఒక ప్రముఖ దర్శకుడి విపరీత ధోరణిపై నిప్పులు చెరుగుతూ.... జర్నలిస్టు ప్రభు తెరకెక్కించిన "రాంగ్ గోపాల్ వర్మ" చిత్రం ఇప్పటికే అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తుండడం తెలిసిందే. చిత్ర పరిశ్రమతో పాటు, పలువురు సినీ ప్రముఖుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, సినిమాలు తీస్తున్న సదరు దర్శకుడి మీదనే ఘాటైన విమర్శనాస్త్రాలు సందిస్తూ
ఒక సినిమా వస్తుండటంతో చిత్ర పరిశ్రమలో ఈ సినిమా గురించి ఆసక్తిదాయకమైన చర్చ జరుగుతోంది!!
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన