పసిడి ధర పెరిగింది..

- February 19, 2016 , by Maagulf
పసిడి ధర పెరిగింది..

బంగారం ధర నిన్న కాస్త తగ్గినప్పటికీ ఈరోజు మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, దేశీయంగా బంగారం వ్యాపారస్తుల నుంచి డిమాండ్‌ పెరగడంతో పసిడి ధర ఈరోజు రూ.29వేలు దాటింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.540 పెరిగి రూ.29,290కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1230.70 అమెరికా డాలర్లుగా ఉంది. వెండి ధర కూడా ఈరోజు పెరిగింది. కిలో వెండి ధర రూ.375 పెరిగి రూ.37,475కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో వెండి ధర కూడా పెరిగినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com