అత్యవసరంగా ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి కువైట్ ఆమోదం
- December 13, 2020
కువైట్ సిటీ:కోవిడ్ కు విరుగుడుగా ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ ను అత్యవసరంగా వినియోగించేందుకు కువైట్ ఆరోగ్య శాఖ అధికారాలు ఇచ్చింది. వ్యాక్సిన్ వినియోగం ఎంతవరకు సురక్షితం, దాని నాణ్యతను సమగ్రంగా సమీక్షించిన తరువాతే ఆమోదం తెలిపినట్లు వివరించింది. అదే సమయంలో క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను కూడా నిశితంగా పరిశీలించామని ఆరోగ్య శాఖ జాయింట్ కమిటీ భరోసా ఇచ్చింది. ప్రజల ఆరోగ్య భద్రత తమకు ముఖ్యమని...అందుకే ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి అత్యవసరంగా ఆమోదం తెలిపినట్లు..అదే సమయంలో వ్యాక్సిన్ కారణంగా ఎలాంటి దుష్ఫ్రభావాలు లేకుండా తగిన జాగ్రత్త ప్రమాణాలు పాటిస్తున్నట్లు వివరించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







