ఆది పినిశెట్టి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ 'క్లాప్' షూటింగ్ పూర్తి
- December 16, 2020
హైదరాబాద్:ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంటగా శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీసాయి మూవీస్ పతాకాలపై రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'క్లాప్'. బిగ్ ప్రింట్ పిక్చర్స్ అధినేత ఐ.బి. కార్తికేయన్ సమర్పిస్తున్నారు. పృథివి ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు.
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న 'క్లాప్' షూటింగ్ పూర్తయింది. లాక్‌డౌన్ తర్వాత ఇటీవల చెన్నైలో షూటింగ్ పునరుద్ధరించి పూర్తి చేశారు. 65 వర్కింగ్ డేస్‌లో చిత్ర బృందం చిత్రీకరణను పూర్తి చేసింది. దీనికి సంబంధించి యూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. చివరి రోజు చివరి సీన్ చిత్రీకరించాక, హీరో ఆది పినిశెట్టి, డైరెక్టర్ పృథివి ఆదిత్య సహా యూనిట్ మెంబర్స్ ఒకరినొకరు కౌగలించుకొని సెలబ్రేట్ చేసుకున్నారు.
తాము ఊహించిన దానికి మించి సన్నివేశాలు చాలా బాగా వచ్చాయనీ, చెన్నైలోని ఓ భారీ స్టేడియంలో చిత్రీకరించిన స్పోర్ట్స్ బేస్డ్ సీన్లు హైలైట్ అవుతాయనీ నిర్మాతలు తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపి, త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.
తారాగణం:
ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్, కృష్ణ కురుప్, నాజర్, ప్రకాష్ రాజ్, రాందాస్, బ్రహ్మాజీ
సాంకేతిక బృందం:
దర్శకత్వం: పృథివి ఆదిత్య
నిర్మాతలు: రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి
సమర్పణ: బిగ్ ప్రింట్ పిక్చర్స్ ఐ.బి. కార్తికేయన్
బ్యానర్స్: శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీసాయి మూవీస్
సంగీతం: మేస్ట్రో ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కుమార్
ఎడిటింగ్: రాగుల్
ఆర్ట్: వైరబాలన్, ఎస్. హరిబాబు
ఫైట్స్: ఆర్. శక్తి శరవణన్
కొరియోగ్రఫీ: దినేష్ మాస్టర్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







