BEL లో ఉద్యోగావకాశాలు
- December 17, 2020
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల ఈ ప్రభుత్వ రంగ సంస్థ వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా మరో 131 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ట్రైనీ ఇంజనీర్-1, ప్రాజెక్ట్ ఇంజనీర్-1, ట్రైనీ ఆఫీసర్-1 తదితర పోస్టులు ఉన్నాయి. ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 25 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ప్రాజెక్టు ఇంజనీర్-1 పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 35 వేల వరకు చెల్లించనున్నారు.
Trainee Engineer-I: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారి కోసం మొత్తం 40 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ ఇంజినీరింగ్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారి కోసం 11 ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారి కోసం 19 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
Project Engineer-I
ఈ విభాగంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారి కోసం 30 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింరగ్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారి కోసం 10 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారి కోసం 17 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారి కోసం ఒక ఖాళీ ఉంది. సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారి కోసం రెండు ఖాళీలు ఉన్నాయి. ఎయిరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన వారి కోసం 1 ఖాళీ భర్తీ చేయనున్నారు.
నిరుద్యోగులకు ESIC శుభవార్త.. 185 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే
నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ లో రూ. 31 వేల వేతనంతో ఉద్యోగాలు
దరఖాస్తు చేసుకోవాలంటే..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో https://jobapply.in/BEL2020GZBTEPE/ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు డిసెంబర్ 26ను గడువుగా నిర్ణయించారు. ఆ తేదీలోగా ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్, OBC, EWS కేటగిరీకి చెందిన అభ్యర్థులు ట్రైనీ ఇంజనీర్-1 పోస్టుకు దరఖాస్తుకు ఆన్లైన్లో రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్-1 పోస్టుకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







