ఉచిత శిక్షణ శిబిరం..

- February 20, 2016 , by Maagulf
ఉచిత శిక్షణ శిబిరం..

మా కళా ఆర్ట్స్ క్రియేషన్స్ ఆఫ్ ఫౌండేషన్ కల్చరల్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో పలు కళాశాలలో యువ కళాకారులకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రాపాక సూర్య ప్రకాశ్‌రావు తెలిపారు. ఈ మేరకు శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో కూచిపూడి, భరత నాట్యం, డ్యాన్స్, కథ, రచన, రంగస్థల, నటన, గేయం, గానం, డబ్బింగ్, డైలాగ్స్, దర్శకత్వం, జానపదం మొదలగు అంశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణలో పాల్గొనే వారి వయసుతో సంబంధం లేదన్నారు. ఈ నెల 21 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తా మన్నారు. 20 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని, ఈ శిక్షణలో రాణించిన వారికి కళాకారులుగా గుర్తింపు కార్డులు, సర్ట్టిఫికెట్స్, రూ.1500 రుసుము ఇస్తామన్నారు. ఆసక్తిగల కళాకారులు 8978394315, 8978426315 నెంబర్లలో సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com