ఆన్‌లైన్ మోసంలో కొత్త కోణం: తస్మాత్ జాగ్రత్త
- February 21, 2016
'సెలబ్ కాన్ మెన్' అనే కొత్త ఆన్‌లైన్ మోసం వెలుగులోకి వస్తోంది. ప్రముఖుల పేర్లతో ఆన్‌లైన్ వేదికగా ఈ మోసాలు జరుగుతున్నాయని షార్జా పోలీసులు గుర్తించారు. విదేశాలకు వెళ్ళి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్నామనీ, తమకు ఆర్థిక సహాయం చేస్తే, స్వదేశానికి రాగానే డబ్బులు తిరిగిచ్చేస్తామని ప్రముఖుల పేర్లతో ఆన్‌లైన్‌లో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివారి నుంచి ఫ్రాడ్ మెసేజ్‌లు లేదా మెయిల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని షార్జా పోలీసులు హెచ్చరించారు. ఏదోలా పరిచయాలు ముందే పెంచుకుని, వాటిని ఆన్‌లైన్ మోసాలకు వినియోగించుకుంటున్న సందర్భాలూ చూస్తున్నామని ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలని షార్జా పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







