చరిత్ర తిరగరాస్తాం: బాలకృష్ణ
- February 22, 2016
శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన లేపాక్షి చరిత్రను తిరగ రాస్తామని అనంతపురం జిల్లా హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. లేపాక్షిలో నంది ఉత్సవాల ఏర్పాట్ల పైన ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆదివారం సమీక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడారు. లేపాక్షిలో వీరభద్ర ఆలయానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. అలాంటి ఆళయానికి కీర్తి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో నంది ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారన్నారు.ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు మొగల్తూరులో గ్రామాన్ని దత్తత తీసుకుంటున్న చిరుకాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి సోమవారం నాడు తన సొంత మండలంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తన సొంతూరు మొగల్తూరు వెళ్లనున్న చిరంజీవి... అక్కడి నుంచి తాను దత్తత తీసుకున్న పేరుపాలెం గ్రామానికి ర్యాలీగా బయలుదేరతారు.సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద రాజ్యసభ సభ్యుడి హోదాలో ఆయన పేరుపాలెం సౌత్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామంలో అభివృద్ధి పనుల కోసం ఆయన ఇటీవలే తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.5 కోట్లను కేటాయించారు. ఆ అభివృద్ధి పనులకు సోమవారం చిరంజీవి శ్రీకారం చుడుతున్నారు.చిరంజీవి పర్యటన నేపథ్యంలో మొగల్తూరు, పేరుపాలెంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. చిరంజీవి పుట్టి పెరిగింది మొగల్తూరు, పేరుపాలెంలలోనే. పుట్టిన గడ్డకు ఆయన రుణం తీర్చుకునేందుకు ముందుకు వచ్చారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







