రాష్ట్రంలో రూ. 4.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు ...
- February 22, 2016
కలెక్టర్ల సదుస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించారు. వచ్చేనెలలో పట్టిసీమ ప్రాజెక్ట్‌ను పూర్తిచేస్తామని ఆయన అన్నారు. 80 టీఎంసీల నీటిని గోదావరి నుంచి తరలిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యుత్ రంగంలో రాష్ట్రానికి ఆరు అవార్డులు వచ్చాయని ఆయన అన్నారు. ఉపాధిహామీ, నాబార్డు, పంచాయతీ నిధులతో గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చంద్రబాబు తెలిపారు. రెయిన్‌గన్ల ద్వారా పంటలను కాపాడుదామని ఆయన పిలుపునిచ్చారు. గతేడాది తీసుకున్న చర్యలు వల్ల భూగర్భజలమట్టం పెరిగిందని సీఎం అన్నారు. వచ్చే ఏడాది లక్ష ఎకరాలకు రెయిన్‌గన్లు ఆర్డర్ ఇస్తామని ఆయన హామినిచ్చారు. పేద ప్రజలకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు సంస్థల సహకారంతో అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వైద్య రంగంలో మనం చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శమని ఆయన కొనియాడారు. విశాఖలో ఇన్వెస్టర్స్ మీట్ విజయవంతంగా నిర్వహించామని ఆయన అన్నారు. రాష్ట్రంలో రూ. 4.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు ముందుకొచ్చారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని చంద్రబాబు హామినిచ్చారు. ఈ ఏడాది కృష్ణా డెల్టాకు సకాలంలో నీరందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







