భారత్ లో కొత్తగా 19,078 కరోనా కేసులు

- January 02, 2021 , by Maagulf
భారత్ లో కొత్తగా 19,078 కరోనా కేసులు

న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.ఇది శుభపరిణామం అని చెప్పాలి.గతంలో 80వేలకు పైగా కేసులు నమోదవుతుండేవి. అయితే, అమెరికా, బ్రిటన్, రష్యా వంటి దేశాల్లో సెకండ్ వేవ్, కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా దేశాల్లో రోజుకు వేలసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటె, ఇండియాలో గడిచిన 24 గంటలలో కొత్తగా 19,078 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,05,788కి చేరింది.ఇందులో 99,06,387 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  2,50,183 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 224 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు కరోనాతో 1,49,218 మంది మృతి చెందారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com