యూఏఈలోని భారత వ్యాపారవేత్తలపై కేంద్రమంత్రి మురళీధరన్ ప్రశంసలు
- January 21, 2021
దుబాయ్:యూఏఈ- భారత్ మధ్య మైత్రి మరింత బలపడేందుకు కింగ్డమ్ లోని ఇండియా వ్యాపారవేత్తల కృషి మరువలేనిది అని భారత విదేశాంగ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మురళీధరన్ ప్రశంసించారు. కోవిడ్ సమయంలో వారు ప్రతిస్పందించిన తీరు..నిస్సాయులను ఆదుకున్న తీరును ఆయన కొనియాడారు. యూఏఈ పర్యటనలో ఉన్న ఆయన యూఏఈలోని భారత వ్యాపారవేత్తల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. దుబాయ్ లోని హోటల్ తాజ్ బిజినెస్ బేలో జరిగిన ఇంటరాక్షన్ లో మాట్లాడిన కేంద్రమంత్రి...యూఏఈలోని భారత వ్యాపారుల కృషి, కష్టపడే తత్వం, చిత్తశుద్ధిని కింగ్డమ్ నాయకత్వం కూడా ప్రశంసించకుండా ఉండలేకపోతుందన్నారు. అందుకే స్థానిక వ్యాపార రంగ ప్రతినిధులు అంతా భారత్, యూఏఈ మధ్య అనధికార రాయబారులుగానే తాము భావిస్తామని పేర్కొన్నారు.
కోవిడ్ సంక్షోభంలో కింగ్డమ్ లోని భారత సమాజానికి వ్యాపారవేత్తలు అందించిన సహకారాన్ని ఆయన కొడియాడారు. అవసరమైన వారికి టికెట్లు సమకూర్చటం, ఆహారం, మెడిసిన్, ఇతర సదుపాయాలు కల్పించి ఐక్యతను చాటారని ప్రశంసించారు. కాన్సులేట్, ఎంబసీలకు సమాంతరంగా వ్యాపారులు, సోషల్ ఆర్గనైజేషన్స్ కృషి చేశాయన్నారు. అదే స్ఫూర్తితో బ్లూ కాలర్ కార్మికుల నైపుణ్యతను పెంచేందుకు కూడా తోడ్పడాలని కోరారు కేంద్రమంత్రి. వందే భారత్ మిషన్ ఇంప్లిమెంటేషన్ విజయవంతం అయ్యేందుకు యూఏఈ ప్రభుత్వం కూడా ఎంతగానో సహకరించిందని ఆయన అన్నారు.





తాజా వార్తలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!







