కేజీఎఫ్ 2 విడుదల తేదీ ఖరారు..!!
- January 29, 2021
కేజీఎఫ్ సినిమాతో యశ్ ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమా సౌత్ కంటే నార్త్ లో భారీ హిట్ ను అందుకుంది. కేజీఎఫ్ సినిమా సమయంలోనే సెకండ్ చాఫ్టర్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. కాగా, ఇప్పుడు సినిమాకు రిలీజ్ డేట్ ను యూనిట్ అనౌన్స్ చేసింది. జులై 16 వ తేదీన సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా యూనిట్ తెలియజేసింది. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో కేజీఎఫ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మూవీలో యశ్ తో పాటుగా బాలీవుట్ తారాగణం కూడా నటిస్తుండటంతో అంచనాలు మరింతగా పెరిగాయి. రిలీజ్ తరువాత కేజీఎఫ్ 2 ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







