ఖర్చు బారేడు..ఫలితం మూరేడు: కువైట్ విద్యశాఖపై ఆడిట్ బ్యూరో ఆసంతృప్తి

- January 29, 2021 , by Maagulf
ఖర్చు బారేడు..ఫలితం మూరేడు: కువైట్ విద్యశాఖపై ఆడిట్ బ్యూరో ఆసంతృప్తి

కువైట్: కువైట్ విద్య శాఖ తీరుపై ఆడిట్ బ్యూరో విభాగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్ నేపథ్యంలో తరగతుల నిర్వహణకు ఈ-విద్య విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన కువైట్ విద్య శాఖ...అందుకు భారీగా నిధులను కూడా కేటాయించింది. విద్యార్ధులు, టీచర్లను అనుసంధానం చేస్తూ ఆన్ లైన్ లో పాఠాలు బోధించేందుకు కావాల్సిన మౌళిక సదుపాయల కోసం ఏకంగా 64 బిలియన్ల దినార్లను ఖర్చు చేసింది. కువైట్ పబ్లిక్ ఎడ్యూకేషన్ సిస్టమ్ లో  4,26,000 మంది విద్యార్ధులు, వందలాది టీచర్లు ఉన్నారు. కానీ, ఈ-పోర్టల్ ను వినియోగించుకున్న వారు మాత్రం కేవలం 5 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు చెబుతున్నా..వాస్తవంలో దాని నుంచి ప్రయోజనం పొందిన వారి సంఖ్య అతి స్వల్పంగా ఉండటం పట్ల ఆడిట్ బ్యూరో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది విద్యాశాఖ అసమర్ధతను చెప్పకనే చెబుతోందని అభిప్రాయపడింది. అలాగే ఉపాధ్యాయుల హజరు నిర్ధారణ కోసం సవిల్ సర్వీసెస్ బ్యూరోకి అవసరమైన వేలిముద్ర విధానాన్ని కూడా అవలంభించలేదని తప్పుబట్టింది. అంతేకాదు..ఉద్యోగులకు ఆర్ధిక బకాయిల చెల్లింపులు కూడా నిబంధనల విరుద్ధంగా జరిగినట్లు ఆడిట్ బ్యూరో తెలిపింది. విద్య శాఖ పేలవమైన, అంతర్గత నియంత్రణ విధానాలు బలహీనంగా ఉన్నాయనేందుకు ఇదో నిదర్శనమని వెల్లడించింది. నిజానికి గత రెండేళ్ల బడ్జెట్ తో పోలిస్తే 2019-2020 ఆర్ధిక సంవత్సరంలో విద్యశాఖకు 6.2 శాతం నిధులు ఎక్కువగా సమకూరాయని, 11 బిలియన్ దినార్ల బడ్జెట్ ఉన్నా...ఆ నిధులను సమర్ధవంతంగా వినియోగించలేకపోయిందని ఆడిట్ బ్యూరో విద్యశాఖ లోపాలను ఎత్తిచూపించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com