BB3 లో ఎమ్మెల్యేగా నారా రోహిత్
- February 01, 2021
హైదరాబాద్:బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబోలో సినిమా వస్తుందంటే ఆ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకుంటారు ప్రేక్షకులు. బాలకృష్ణ BB3 హ్యాట్రిక్ మూవీలో నారా రోహిత్ నటిస్తున్నారని, అందులో ఆయన క్యారెక్టర్ ఎమ్మెల్యే అని తెలుస్తోంది. బాణం, సోలో, రౌడీ ఫెల్లో, అసుర లాంటి విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో నారా రోహిత్‌కు ఈ మధ్య సినిమాలేవీ లేవు. దాంతో ఆయన BB3 సినిమాలో ఎమ్మెల్యే రోల్ చేస్తున్నారని సమాచారం. దాదాపుగా మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రోహిత్ బరువు కూడా పెరిగారు. దీంతో ఈ చిత్రంలోని పాత్రకోసమని బాడీ మీద శ్రద్ధ పెట్టి బరువు తగ్గారు. కొత్త లుక్‌లో ఉన్న ఆయన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాలోనూ రోహిత్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య సినిమాలో ఎమ్మెల్యేగా నటించడం రోహిత్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని సమాచారం. బాలకష్ణ 106వ చిత్రం తెరకెక్కుతున్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల్ రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







