ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

- February 11, 2021 , by Maagulf
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక జరగనుంది. అంతలోనే ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 14న పోలింగ్ జరగనుంది. ఏపీలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ఫిబ్రవరి 24న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 26 వరకు గడువు విధించారు. ఇక మార్చి 14న ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 17న ఫలితాలను ప్రకటిస్తారు.

తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌తో పాటు నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ అభ్యర్థిగా రాములు నాయక్‌, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానానికి చిన్నారెడ్డిని ఖరారు చేసింది. అధికార టీఆర్ఎస్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. త్వరలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని కూడా ప్రకటిస్తామని ఇటీవలే చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com