భారత్ లో కరోనా కేసుల వివరాలు

- February 13, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 12,143 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,395 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,92,746కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 103 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,550కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,00,625 మంది కోలుకున్నారు. 1,36,571 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 79,67,647 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,55,33,398 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,43,614 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com